రెండో విడత పోలింగ్ ప్రారంభం
WNP: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట, మదనాపురం, వనపర్తి మండలాల పరిధిలోని 89 గ్రామ పంచాయతీలు, 702 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌కు అవకాశం ఉంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.