'ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి'
W.G: ప్రకృతి వ్యవసాయంపై రైతుల దృష్టి సారించాలని తణుకు ఏఎంసీ వైస్ ఛైర్మన్ వల్లూరి మోహన్ అన్నారు. తణుకు మండలం వేల్పూరులో రైతన్న మీకోసం గ్రామస్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండల వ్యవసాయ అధికారి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోహన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నిర్దేశించిన ఐదు సూత్రాలు ఆధారంగా రైతులు కృషి చేయాలన్నారు.