ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్

ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్

VZM: ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆడిటోరియంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు తప్పనిసరిగా 10 గంటలకు నిర్వహించే రెవెన్యూ క్లినిక్ హాజరై, వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.