VIDEO: కలెక్టరేట్ ఎదుట మహిళల నిరసన

VIDEO: కలెక్టరేట్ ఎదుట మహిళల నిరసన

గుంటూరు కలెక్టరేట్‌ను సీతమ్మ కాలనీవాసులు ముట్టడించారు. 10 రోజుల క్రితం హత్యకు గురైన వీరాంజనేయులు కేసులో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.