జిల్లా పోలీస్ కార్యాలయానికి 65 వినతులు

సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 65 వినతులు వచ్చాయి. ఎస్పీ రత్న పిటిషనర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను చట్ట పరిధిలో విచారించి, సత్వరమే బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.