జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
JGL: కోరుట్లలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్, జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్స్‌ను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, భవిష్యత్ లక్ష్యాలు, పాఠశాల పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎన్నికలు కులం-మతం ఆధారంగా కాకుండా అభివృద్ధి-ప్రగతి కోసం జరగాలన్నారు.