VIDEO: జలదిగ్బంధంలో భీంగల్ ఎక్సైజ్ కార్యాలయం
NZB: భీమ్గల్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి భీంగల్ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయం కింది అంతస్తు నీట మునిగింది. అందులోనే ఉన్న ఎక్సైజ్ సిబ్బందిని రక్షించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు వాగులు వంకల వద్దకు వెళ్లవద్దని జిల్లా అధికారులు సూచించారు.