తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా తల్లి చెంతకు
WG: భీమవరం వన్ టౌన్ పరిధిలోని మారుతీ టాకీస్ సమీపంలో గులాబీ సెంటర్ వద్ద తప్పిపోయి ఏడుస్తున్న ఏడేళ్ల చిన్నారిని గురువారం పోలీసులు సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. డయల్ 112 ద్వారా సమాచారం అందుకున్న సీఐ నాగరాజు తక్షణమే స్పందించి పాపను అనునయించారు. అనంతరం ఆ చిన్నారి సర్రాజు వీధికి చెందిన సోడాదాసి మాధవి కుమార్తెగా గుర్తించి ఆమెకు అప్పగించారు.