ఎన్నికలు.. నామినేషన్ దాఖలు చేసిన ప్రతిపక్షనేత
పశ్చిమ్ బెంగాల్ ప్రతిపక్షనేత, బీజేపీ నేత సువేందు అధికారి తన నామినేషన్ దాఖలు చేశారు. భవానీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ బరిలో నిలుస్తున్న సువేందు తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సమయంలో సువేందుతో పాటు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఉన్నారు. కాగా గత ఎన్నికల్లో బెంగాల్ సీఎం మమతాకు పోటీగా నిలిచి ఆమెను సువేందు అనూహ్యంగా ఓడించిన విషయం తెలిసిందే.