గోనెగండ్లలో యాక్సిడెంట్.. ఒకరు మృతి

KRNL: గోనెగండ్ల గ్రామ సమీపంలో ఉన్న భారత్ గ్యాస్ గోదాం వద్ద మంగళవారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. కర్నూల్ వైపు నుంచి ఎమ్మిగనూరుకు వస్తున్న ప్రైవేట్ అంబులెన్సు, లారీ ఢీ కొన్నాయి. ఘటనలో ఎమ్మిగనూరుకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ ఖతల్ హుస్సేన్ (30) మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.