మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలు బుధవారం విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల సహాయ అధికారి చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా సాగిందని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.