మహిళ ఆత్మహత్యయత్నం.. కాపాడిన పోలీసులు
SDPT: ఆత్మహత్యకు ప్రయత్నంచిన మహిళను పోలీసులు కాపాడారు. జిల్లాలోని కుకునురుపల్లి పరిధిలో సుజాత అనే మహిళ కుటుంబ కలహాలతో సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు ఆమెను రక్షించారు. సరైన సమయంలో డయల్ 100క సమాచారం అందడంతో ప్రాణాపాయం తప్పింది. ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ, క్షణికావేశంలో ఆత్మహత్య వంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా, చట్టపరంగా పరిష్కరించుకోవాలన్నారు.