ప్రాణాలు నిలిపిన 100 డయల్

ప్రాణాలు నిలిపిన 100 డయల్

నిర్మల్: బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణపతి అర్ధరాత్రి రోళ్ల వాగు దగ్గర పీతలు పట్టడానికి వెళ్లి పాముకాటుకు గురికాగా ఆ సమయంలో 100కు కాల్ చేయగా వెంటనే స్పందించిన బీర్పూర్ ప్రొబిషనరీ ఎస్సై రాజు తమ సిబ్బందితో కలిసి పాముకాటుకు గురైన వ్యక్తిని అటవీ ప్రాంతం నుంచి సురక్షితంగా 108 అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.