తొక్కిసలాట బాధితులకు రూ.15 లక్షలు పరిహారం
AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనా స్థలితో పాటు, పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తీవ్రగాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.