అన్నదాతల ఆశలపై నీళ్లు.. పడిపోయిన దిగుబడులు
ADB: జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది వానకాలంలో రైతులు 5.80 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పత్తి 4.25 లక్షల ఎకరాలు, సోయాబిన్ 90 వేలు, కంది 60 వేల ఎకరాల్లో సాగైంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి రెండు నెలలపాటు వర్షాలు సాగుకు అనుకూలించడంతో రైతులు దిగుబడులపై ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి.