వేద పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

W.G: తాడేపల్లిగూడెం పట్టణం 23వ వార్డులో నూతనంగా నిర్మించిన శంకర మఠం వేద పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం సందర్శించారు. వేద పాఠశాలలో జరుగుతున్న చిన్నారుల పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించే సంచారకులకు రూ.35,000లను విరాళం ఇచ్చారు.