VIDEO: చేనేత కార్మికుల ధర్నాకు తరలిరావాలి: CITU
SRCL: ఈనెల 25న హైదరాబాదులో తలపెట్టనున్న చేనేత కార్మికుల ధర్నాకు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయు పవర్ లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వం త్రిఫ్ట్ పథకం వెంటనే అమలు చేయాలన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.