'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు'
BDK: కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఎస్పీ రోహిత్ రాజ్ నేరాలపై అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగులు, ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.