నేడు మహిబూబ్ దర్గా గందోత్సవం
VKB: మహిబూబ్ సుభాని దర్గా గంధోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు మైనారిటీ నాయకులు ఎస్ఎం. గౌసన్ తెలిపారు. శుక్రవారం జామా మసీద్ నుంచి కొడంగల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మహిబూబ్ సుభాని దర్గా వరకు ర్యాలీ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా శనివారం ఉదయం జామే మసీద్‌లో అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.