'పింఛన్లు తొలగింపు అమానుషం'

KRNL: రాష్ట్రంలో అర్హుల పింఛన్లు తొలగించడం అమానుషమని, వెంటనే వాటిని పునరుద్ధరించాలని ఎమ్మిగనూరు వైసీపీ ఇంఛార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుపేదల కడుపులో అన్నం లాక్కోవడమేనని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.