VIDEO: 'జనసేన సభ్యత్వ నమోదును విజయవంతంగా నిర్వహించాలి'
కోనసీమ: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పి. గన్నవరం నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. పి. గన్నవరం క్యాంప్ కార్యాలయం వద్ద జనసేన శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సాదక్ వాలంటీర్లు, గ్రామ శాఖ, మండల నాయకులు బాధ్యతగా తీసుకొని సభ్యత్వ నమోదును నిర్వహించాలన్నారు.