హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ MLA

హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ MLA

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో గల పెద్ద హనుమాన్ ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం దర్శించుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. MLA వెంట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.