పిల్లల చదువులో తల్లిదండ్రులదే కీలక పాత్ర: కలెక్టర్

పిల్లల చదువులో తల్లిదండ్రులదే కీలక పాత్ర: కలెక్టర్

NGKL: విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బిజినేపల్లి మండలం పాలెం జడ్పీ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపరచడంలో, పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు.