'వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'
ELR: రబీకి 126 రకం వరి విత్తనం సాగుకు అనుమతి ఇవ్వాలని, 126 వరి విత్తన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం దెందులూరు మండలం పోతునూరులోని రైతు సేవా కేంద్రం సమీపంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు.