రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి మాధవరం-1లోని పార్వతీపురం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ముమ్మడి గుంటపల్లి గ్రామానికి చెందిన అంకె నాగేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.