'జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం'

'జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం'

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వాల్మీకి లక్ష్మన్న స్పష్టం చేశారు. శనివారం కౌతాళం మండలంలోని తోవి, అగసలదిన్నె గ్రామాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగుర వేస్తామన్నారు.