మహాశివరాత్రి జాతర కోసం ఉచిత బస్సులు ప్రారంభం

కరీంనగర్: మహా శివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యం కొరకు వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ నుండి గుడి వరకు ఉచిత బస్సులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు, ఈఓ కృష్ణ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.