కాణిపాకంలో ఎమ్మెల్యే బోండా ఉమా ఉమామహేశ్వర రావు
CTR: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్, ఈఈ వెంకటనారాయణ, ఏఈవో రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.