చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు

చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు

KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ గేట్ వద్ద LMD పోలీసులు గురువారం రాత్రి చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు రోజు వారి కఠిన తనిఖీలు కొనసాగనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబ్బు, మద్యం, బంగారం వంటి నిషేధిత రవాణా వస్తువులు పట్టుకుంటే సీజ్ చేసి విచారణ చేపడుతామని పేర్కొన్నారు. వాహనదారులు ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు.