నూతన సర్పంచ్‌ను సన్మానించిన పద్మశాలి సంఘం
MDK: పెద్ద శంకరంపేట నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్‌కు పద్మశాలి సంఘం అధ్యక్షుడు వడిచర్ల మల్లేశం ఘనంగా శాలువాలతో సన్మానించారు. జంగం రేణుక శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి తను కట్టుబడి పని చేస్తానని అన్నారు. అందరం ఐక్యంగా ఉంటేనే అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.