‘MRO పరిధిలో సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలి’
విశాఖ కలెక్టరేట్‌లో ఇవాళ పీజీఆర్ఎస్ సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. 21 రోజులు గడువు దాటినా ఫిర్యాదు పరిష్కరించని ఆనందపురం సర్వేయర్‌కు నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. పద్మనాభం MRO పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, డీఎంహెచ్‌వో, అటవీ శాఖలు తమ పెండింగ్ ఫైళ్లను తక్షణమే క్లియర్ చేయాలని సూచించారు