వచ్చే నెల 4న తీర్థ మహోత్సవం

వచ్చే నెల 4న తీర్థ మహోత్సవం

అనకాపల్లి: మోసయ్యపేట గ్రామంలో వచ్చే నెల నాలుగవ తేదీన అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ పంచదార్ల పైడిరాజు తెలిపారు. ఈ మేరకు గ్రామంలో బుధవారం తీర్థ మహోత్సవం వాల్ పోస్టర్‌ను రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు.