అధికారులకు ముగిసిన జనగణన శిక్షణ తరగతులు

అధికారులకు ముగిసిన జనగణన శిక్షణ తరగతులు

AKP: డైట్ కళాశాలలో మూడు రోజులు పాటు జనగణనపై నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిసాయి. 200 మంది అధికారులు శిక్షణ పొందారని డీఆర్ఓ సత్యనారాయణ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శిక్షణ పొందిన అధికారులు మండల స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. మే1వ తేదీ నుంచి జరిగే జనగణనకు సన్నద్ధం కావాలని సూచించారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వే జరగాలన్నారు.