చెత్త సేకరణకు ట్రై సైకిల్స్‌ను పంపిణీ చేసిన ఎంపీపీ
SKLM: జలుమూరు మండలంలో పలు పంచాయతీలకు చెత్తను సేకరించే ట్రై సైకిల్స్‌ను ఎంపీపీ వాన గోపి ఆదివారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పరిశుభ్రత పాటించాలని ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కోరారు. ఎంపీడీవో చిన్నమ్మడు మరికొన్ని పంచాయతీలకు చెత్త సేకరణ వాహనాలు రావాల్సి ఉందని, అవి అందిన వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు.