ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షలు: మంత్రి కోమటిరెడ్డి
NLG: నల్గొండ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసిన GPలకు రూ.10 లక్షల ప్రోత్సాహకంతో పాటు తన ఎమ్మెల్యే నిధుల నుంచి అదనంగా రూ.20 లక్షల నిధులను మంజూరు చేస్తానని మంత్రి కోమటి రెడ్డి హామీ ఇచ్చారు. ఈరోజు నల్గొండలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవాలని పిలుపునిచ్చారు.