'గత పాలకులు గంజాయి సాగును ప్రోత్సహించారు'
KKD: పెదపూడిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. గత పాలకులు ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించి, గంజాయి సాగును ప్రోత్సహించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు గంజాయిని అరికట్టాలని ఎమ్మెల్యేని కోరారు.