రాయచోటిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

అన్నమయ్య: రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆదివారం మా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. మా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో శుభప్రదమని అన్నారు.