జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలు

జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలు

NLG: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి పది మందిలో ఒకరు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రధానంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, డెంగీ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాల కారణంగా కాలనీలు, ఇళ్లు పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచి దోమలు ఎక్కువయ్యాయి. వారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది.