INSPIRATION: లాలా లజపతిరాయ్
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చిరస్మరణీయమైన నాయకుడు లాలా లజపతిరాయ్. ఆయనను 'పంజాబ్ కేసరి' అని పిలుస్తారు. ఆర్యసమాజం ద్వారా సామాజిక సంస్కరణలకు కృషి చేస్తూనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 1928లో 'సైమన్ కమిషన్' వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలకు గురై, దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన ధైర్యం, దేశభక్తి నేటికీ భారతీయులకు స్ఫూర్తిదాయకం.