ఎమ్మిగనూరులో పర్యటించిన కమిషనర్..!

ఎమ్మిగనూరులో పర్యటించిన కమిషనర్..!

KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెత్త పేరుకుపోకుండా, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతిరోజూ శుభ్రత పనులు నిర్వహించాలని సూచించారు. అనంతరం శ్రీనివాస సర్కిల్‌లోని అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.