'పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి'

'పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి'

PDPL: పత్తి పంటను మద్దతు ధరకు అమ్ముకోవడానికి రైతు సోదరులు కపాస్ కిసాన్ యాప్‌ను ఇన్‌స్టాల్  చేసుకుని ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ధర్మారం మండల ఇన్‌ఛార్జ్ వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ఆధార్ అనుసంధాన మొబైల్ ద్వారా ఓటీపీతో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. మొబైల్ నెంబర్ మార్చుకోవాలనుకుంటే వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు.