ఫిల్ సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్

ఇంగ్లండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్ లీగ్'లో మాంచెస్టర్ ఒరిజినల్స్ కెప్టెన్ ఫిల్ సాల్ట్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ట్రెంట్ రాకెట్స్ ఆటగాడు మాక్స్ హోల్డెన్ కొట్టిన షాట్‌ను సాల్ట్ గాల్లోకి డైవ్ చేస్తూ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్‌తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.