సేపక్ తక్రా పోటీలకు పొతంగల్ కలాన్ క్రీడాకారులు
KMR: గాంధారి మండలం పొతంగల్ కలాన్ గ్రామానికి చెందిన క్రీడాకారులు అక్షయ, అమూల్య, సమ్రీన్, సౌమ్యశివ, సిద్దు రాష్ట్ర స్థాయి U/19 సేపక్ తక్రా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. కామారెడ్డి జిల్లా కర్షక్ బీఈడీ కళాశాలలో మంచి ప్రతిభ కనబర్చారు. కురవిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని చెప్పారు.