VIDEO: హౌరా ఎక్స్‌ప్రెస్‌లో కొండ చిలువ

VIDEO: హౌరా ఎక్స్‌ప్రెస్‌లో కొండ చిలువ

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని హౌరా ఎక్స్‌ప్రెస్‌లో పాము కలకలం రేపిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని రైల్వే సిబ్బందికి తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే భద్రతా సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు పామును జాగ్రత్తగా పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. సమయానికి స్పందించిన సిబ్బందికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికీ ప్రమాదం జరగలేదు.