తుకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు

తుకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు

ADB: వ్యాపారులు తమ దుకాణాలలో తూనికలు, కొలతల విషయంలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ జిల్లా అధికారి భూలక్ష్మి హెచ్చరించారు. ఆమె లోకేశ్వరం మండల కేంద్రంలోని పలు దుకాణాలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దుకాణాలలో తూనిక యంత్రాలను, కొలత పరికరాలను పరిశీలించారు. వినియోగదారులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.