GHMC అడాప్షన్ డ్రైవ్‌లో వీధి కుక్కలకు కొత్త జీవితం

GHMC అడాప్షన్ డ్రైవ్‌లో వీధి కుక్కలకు కొత్త జీవితం

HYD: హైదరాబాద్ జేవీఆర్ పార్కులో ఆదివారం జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అడాప్షన్ డ్రైవ్‌లో 24 వీధి కుక్క పిల్లలను కొత్త యజమానులకు ఇచ్చారు. 'దత్తత తీసుకోండి, కొనవద్దు' అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ద్వారా వాటి జీవితాలను కాపాడటంతో పాటు, వీధుల్లో సంచరించే కుక్కల సంఖ్యను తగ్గించవచ్చని అధికారులు తెలిపారు.