ఉండి శివాలయంలో వసంత పంచమి వేడుకలు

ఉండి శివాలయంలో వసంత పంచమి వేడుకలు

W.G: ఉండి రాజుల పేటలోని శ్రీ పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధిరాజు చలపతిరావు మాట్లాడుతూ.. మాఘ మాసంలో అక్షరాభ్యాసం చేయడం వల్ల జ్ఞానవృద్ధి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ సాయి లచ్చిరాజు, తదితరులు పాల్గొన్నారు.