మెదక్‌లో ముగిసిన 11వ జోనల్ మీట్
మెదక్ జిల్లా కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలో జరుగుతున్న రాజన్న సిరిసిల్ల జోనల్ స్థాయి గేమ్స్ ముగిసాయి. 11వ జోనల్ మీట్ ముగింపు కార్యక్రమానికి మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై గెలుపొందిన విద్యార్థునులకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్‌లు పద్మావతి, సత్యవతి, అనురాధ, సంధ్యారాణి, శ్రీనివాస్ పాల్గొన్నారు.