'అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి'
NLG: అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ ఆకాంక్షించారు. నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునందన్ రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి అభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.