'ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోము'
KMM: అనుమతులు లేని ల్యాబ్‌లను వెంటనే సీజ్ చేస్తామని, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి రామారావు స్పష్టం చేశారు. ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల కేంద్రంలోని రక్త పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మండల వైద్యాధికారి అరుణాదేవికి సూచనలు అందించారు.